ముంబై మహానగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తలపిస్తుంది అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.అయితే ఆ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ముంబైలోని కంగనా ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ బీఎంసీ అధికారులు కూలగొట్టారు. అయితే కంగనా మాత్రం వెనుకడుగు వేయలేదు. శివసేన ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంది.
కాగా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ను ప్రత్యేకంగా కలవనున్నారు.కంగనా ఆఫీసును బీఎంసీ అధికారులు కూలగొట్టడం పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీ వివరణ అడిగారట. ఈ నేపథ్యంలోనే కంగన సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నర్ ను కలవడం పట్ల ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.