మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శల పాలవుతున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అండగా నిలిచారు. ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు రావడాన్ని ఖండించారు. భౌతిక హాని తలపెట్టడం తగదని కంగనా అభిప్రాయపడ్డారు కంగనా.
తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఆమెకు ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ”ఇది అఫ్గానిస్థాన్ కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసే ప్రభుత్వం ఇక్కడ ఉందని మరచిపోవద్దు” అని పోస్ట్ చేశారు.
టీవీ ఛానెల్ చర్చలో నుపూర్ చేసిన వ్యాఖ్యలతో విభేదించేవారు.. ఆమెకు వ్యతిరేకంగా చట్టబద్ధమైన చర్యలను ఆశ్రయించాలని సూచించారు. శర్మ ఫిర్యాదు మేరకు ఆమెకు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Advertisements
మరోవైపు.. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. వీరి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇస్లామిక్ దేశాలన్నీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికే డజను ముస్లిం దేశాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. ఇరాక్, లిబియా, మలేసియా, తుర్కియే(టర్కీ)లతో పాటు.. ఈజిప్ట్ లోని అరబ్ పార్లమెంటు నిరసన తెలిపింది.
పూర్తి కథనం…