బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి నూపుర్ శర్మతో పాటు నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ ప్రకటిచింది.
తాజాగా నూపుర్ శర్మకు మద్దతుగా బాలీవుడ్ నటి కంగనారనౌత్ నిలిచారు. ఈ మేరకు ఇన్ స్టాలో నూపుర్ శర్మకు మద్దతుగా ఆమె పోస్టు పెట్టారు. పీకే సినిమాలోని ఓ స్టిల్‌ను ఆమె పెట్టారు. కేవలం ఓ మహిళ ఆవేశంలో చేసిన కామెంట్లకు దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు.
ఇలాంటి పనులు ఎవరు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇది ఆందోళన కలిగించే ప్రవర్తన అని ఆమె అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత మరోసారి ఆమె ఇన్ స్టాలో మరోసారి కామెంట్స్ చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఇంతియాజ్ జలీల్, ఓవైసీల మధ్య జరిగిన సంభాషణను ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేశారు.
తన ముస్లిం స్నేహితులు చాలా మంది మద్యపానం, ధూమపానం చేస్తారని ఆమె పేర్కొన్నారు. వారిలో చాలా మంది వివాహానికి ముందు సెక్స్ లో పాల్గొన్నారని, కనీసం బుర్ఖా కూడా ధరించరని ఆమె అన్నారు. వారు పంది మాంసం తింటారని, పని పరిస్థితుల కారణంగా హలాల్‌ను కూడా పాటించరని చెప్పారు. ఇది భారతదేశానికి గొప్ప అందమని అన్నారు. అది స్వాతంత్ర్యం కాదంటే నుపుర్ మాత్రమే కాదు, అందరూ నేరస్థులుగా మారతారని ఆమె అన్నారు.