కంగనా రనౌత్… ఈ పేరు చెప్పగానే కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక వివాదం ఉండే ఉంటుందని..అవును మీరు అనుకున్నది నిజమే. తాను అద్భుత నటి శ్రీదేవి తర్వాత కామెడీ చేయగలిగింది తానేనని చెప్పుకొచ్చింది కంగనారనౌత్. తను వెడ్స్ మను సినిమా సమూలంగా తన కెరీర్ మార్చేసింది అని పేర్కొంది. తను వెడ్స్ మను ప్రేక్షకుల ముందుకు వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అదే విషయమై మాట్లాడుతూ నేను కెరీర్ ను ప్రారంభించి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాను.
తను వెడ్స్ మను నా కెరీర్ ను మార్చేసింది. విభిన్నమైన కథ నా నటన ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో కామెడీ ని అద్భుతంగా పండించాను. నటి శ్రీదేవి తర్వాత కామెడీ పండించగలిగింది నేను అంటూ చెప్పుకొచ్చింది.