జేఎన్‌యూ విద్యార్థులకు దీపిక మద్దతుపై బాలీవుడ్ తార కంగనా రనౌత్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ కు వెళ్లి దీపిక నిలబడటం ఆమె వ్యకిగతమని .. కానీ తాను మాత్రం ఆలాంటి గ్యాంగ్ కు సపోర్ట్ ఇవ్వబోనని తేల్చిచెప్పారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ..దీపికా జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతునివ్వడం తప్పో ఒప్పో నేను డిసైడ్ చేయలేనని స్పష్టం చేశారు. కానీ తాను మాత్రం దేశాన్ని విభజించాలని కోరుకునే విద్యార్థులకు మద్దతునివ్వలేనని స్పష్టం చేశారు. జేఎన్‌యూ విద్యార్థులను ‘తుక్డే గ్యాంగ్’ అంటే విమర్శించారు.