బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో రాజకీయ నాయకురాలి పాత్రను పోషించడానికి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కావడం విశేషం. ఇదొక దిగ్గజ రాజకీయ నాయకురాలి పాత్ర. ఓ పుస్తకం ఆధారంగా ఇది తెరకెక్కుతుంది.
అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితులు, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి అంశాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాలో లాల్ బహదూర్ శాస్త్రి, సంజయ్ గాంధీ పాత్రలు కూడా కనిపిస్తాయి.. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. ఈ పాత్ర చేయటం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది కంగన.