బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత కంగనారనౌత్ నిత్యం ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్ పెద్దలకైనా మరోవైపు మహారాష్ట్ర సర్కార్ పైన కంగన తనదైన శైలి లో విమర్శలు చేస్తుంది. ఇక ఇప్పటికే కంగనారనౌత్ దేశద్రోహం తో పాటు మరికొన్ని కేసులను ఎదుర్కొంటుంది.
మరోవైపు సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతోంది. అయితే ఈ బిజీ షెడ్యూల్ వల్ల తన మేనల్లుడు పృథ్విరాజ్ ను మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన మేనల్లుడు పృద్విరాజ్ కు ముద్దు పెడుతున్న ఫోటోని కంగనా షేర్ చేసింది. షూట్ కోసం బయలుదేరినప్పుడు వెళ్లవద్దని తాను చెప్పాడని తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే రెండు నిమిషాలు నాతో కూర్చుని వెళ్ళు అని చెప్పాడని తెలిపింది. ఇప్పటికీ అతని ముఖం గుర్తుకు వస్తే తనకు కన్నీరు ఆగదని చెప్పుకొచ్చింది.