ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ప్రతి విషయంలో తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తోంది. కాగా.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై కంగనా రనౌత్ ఓ ప్రకటన చేసింది. ఈ సినిమా విజయంపై ప్రశంసలు కురిపించింది.
అందులో భాగంగానే మరోసారి బాలీవుడ్ ప్రముఖులను ఎగతాళి చేస్తూ మాట్లాడింది. పరిశ్రమలో ఉన్న అతిపెద్ద పేర్లు ఈ చిత్ర విజయంపై మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ ఘాటుగా విమర్శించింది. ఈ మేరకు సినిమాకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు చెప్పింది కంగనా.
అతి ముఖ్యమైన సినిమాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించింది. ఈ మూవీ కేవలం కంటెంట్ పరంగానే కాకుండా భారీ వసూళ్లు రాబట్టి ఎన్నో చిన్న సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చింది.
Advertisements
అంతేకాదు భారీ బడ్జెట్ లేదా విజువల్/విఎఫ్‌ఎక్స్ తో కూడిన సినిమాలు చూడటానికి కళ్లద్దాలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల అపోహలను, ఆలోచనలను ఈ చిత్రం బద్దలు కొట్టి.. థియేటర్లకు తీసుకువస్తోందన్నారు. ఇక చివరగా సినిమాను ఉద్ధేశిస్తూ.. ‘చీప్ పబ్లిసిటీ లేదు. ఫేక్ నంబర్లు లేవు. మాఫియా లేదు. దేశ వ్యతిరేక ఎజెండా లేదు. సినిమాతో దేశం మారిపోతుంది. జై హింద్’ అంటూ ట్వీట్ చేసింది కంగనా.