రాంగోపాల్ వర్మ ఎంత కాంట్రవర్సియో… బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా అంతే. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ, వివాదాస్పద కామెంట్స్, సినిమాలు చేయటంలో తనకు తానే సాటి.
కంగనా ఇప్పుడు తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది. అయోధ్య రామాలయ నిర్మాణంకు సంబంధించి సినిమా తీయబోతున్నట్లు ప్రకటించింది. 2020లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని, ఈ సినిమాకు అపరాజిత అయోధ్య అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా కంగనా నిర్మాత అవతారం కూడా ఎత్తబోతుంది.
అంతేకాదు.. ఈ సినిమా కథను బాహుబలి కథ అందించిన డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని కంగనా సోదరి స్వయంగా ట్వీట్ చేయటంతో… అధికారికంగా ధృవీకరించినట్లైంది.
ప్రస్తుతం జయలలిత జీవితకథ ఆధారంగా… ఆమె బయోపిక్‌లో నటిస్తోంది కంగనా.