వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరోసారి స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ బాలీవుడ్ భామ. కంగనాకు గర్వం ఎక్కువ అని కొంతమంది అంటుంటారు. తనను విమర్శించే వారిపై ఎదురుదాడి చేయడంలోనూ కంగనా రూటే సెపరేటు. తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పేరు ప్రస్తావించకుండా ఉండేందుకు పాపం ఆమిర్ ఖాన్ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారు.
సీనియర్ జర్నలిస్ట్, రచయిత శోభా డే రచించిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మీడియాతో ఆమిర్ ఖాన్, శోభా డే ముచ్చటించారు. శోభా డే బయోపిక్ తీస్తే ఆమె పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని ఆమిర్ ఖాన్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి ఆమిర్ ఖాన్.. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ పేర్లు చెప్పారు. వీళ్లు ముగ్గురూ నాకు ప్రధానంగా కనిపిస్తున్నారని ఆమిర్ అన్నారు.
అయితే శోభా డే మాత్రం కంగనా రనౌత్ పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత అమీర్ మాట్లాడుతూ.. అవును కంగనా కూడా మంచి హీరోయిన్ అనేక కొత్త రకాల పాత్రలను పోషిస్తుంది అని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిపై కంగనా కూడా రియాక్ట్ అయింది.
ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ‘అయ్యో పాపం అమిర్.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డారు.. అంటూ సెటైర్లు వేశారు. నా పేరును ప్రస్తావించేందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా నటన, కళ, శ్రమను ప్రశసించడానికి ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇది అద్దం పడుతుంది. మీ కొత్త పుస్తకానికి నా శుభాకాంక్షలు’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Aamir Khan praised Kangana Ranaut for her versatility at Shobaa De’s book launch today#KanganaRanaut #AamirKhan pic.twitter.com/3Ya2ndt1Mi
— Kangana Ranaut Daily (@KanganaDaily) February 10, 2023