బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటుడు అమీర్ ఖాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆయన తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా పై విమర్శలకు ఆయనే కారణమని అభిప్రాయపడింది.
అమీర్ దేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. గతంలోనూ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ పీకే సినిమా తెరకెక్కించి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇప్పుడేమో భారత్ లో అసహనం పెరిగిపోయిందని మాట్లాడుతున్నాడు.
ఇకపై మతం లేదా సిద్ధాంతాలపై సినిమాల్లో నటించడం , నిర్మించడం మానుకోవాలి అంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యింది. ఇక పై భారత్ గురించి ఇటువంటివి చేస్తే భారత ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇక బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా పై రీసెంట్ గా స్పందించిన హీరో… తనకు భారత్ అంటే చాలా ఇష్టమని కానీ కొంతమంది తప్పుగా కన్వే చేయడం ఇబ్బందిగా ఉందని బాధపడ్డాడు.