బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పిన అది తక్కువనే అనిపిస్తుంది. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. ఆమెకు అది అలవాటుగా మారిపోయింది ఏమో అని అంటుంటారు కొందరు నెటిజన్లు. అయితే, ఈసారి కంగనా రనౌత్ ధరించిన చీర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఈ చీర ధర తెలిసి షాక్ అవుతున్నారు.
కంగనా రనౌత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ధాకడ్’. మే 5న ధాకడ్ సాంగ్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. రాజస్థాన్ జైపుర్‌లోని రాజ్ మందిర్ థియేటర్లో ధాకడ్ చిత్రంలోని తొలి సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ వేడుకకు హాజరైన కాంట్రవర్సీ క్వీన్ అందమైన చీర ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం అందరూ ఆమె ధరించిన చీర గురించే చర్చించుకుంటున్నారు.
తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన సారీని కంగన ఈ ఈవెంట్‌లో ధరించింది. ‘పీసెస్ ఆఫ్ యూ’ కలెక్షన్లో భాగంగా తరుణ్ రూపొందించిన ఈ చీర ధర రూ.4 లక్షలకు పైనే. ఇది తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ చీరలో కంగనా రనౌత్ రాయల్‌గా మెరిసిపోయింది. చీరకు మ్యాచింగ్‌గా కుందన్ నెక్లెస్‌తో పాటు దానికి మ్యాచ్ అయ్యే చెవిపోగులను ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
ఇక సినిమా విషయానికి వస్తే.. కంగన ప్రధాన పాత్రలో వస్తున్న ‘ధాకడ్’ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. రజ్నీశ్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దీపక్ ముకుత్, సోహెల్ మక్లాయ్ నిర్మిస్తున్నారు. భారతదేశంలోని బొగ్గు గనుల బెల్ట్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆసియాలోని అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ కథను ‘ధాకడ్’లో చూపించబోతున్నారు.