బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయమైన కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. తాజాగా, తన పెళ్లి విషయంలో సంచలన కామెంట్స్ చేసింది. కంగనా ఎవర్ని పెళ్లాడుతుంది? ఎవరితో ఏడడుగులు వేయనుంది? ఆమె మనసు గెలుచుకునేది ఎవరు? ఇలా అనేక ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ తరుణంలో తన పెళ్లిపై కంగనా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘ధాకడ్’ సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది కంగనా. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలో మాదిరిగా నిజ జీవితంలోనూ మీరు అబ్బాయిలను కొడతారట? అని విలేకర్లు అడిగి ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “అస్సలు కాదు.. అబ్బాయిలపై నేను చేయి చేసుకుంటానంటూ పలువురు సృష్టిస్తోన్న వదంతుల వల్లే నాకు పెళ్లి కావడం లేదు’ అని కంగనా నవ్వుతూ చెప్పింది.
ఇక ‘ధాకడ్’ కథ తనకెంతగానో నచ్చిందని, తన రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కంగనా ఏజెంట్ ‘అగ్ని’గా నటించింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సిద్ధమవుతోన్న ఈ మూవీ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంది.