దీపికా పడుకొనే నటించిన ‘చపాక్’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం యాసిడ్ అటాక్స్ అంశం సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘చపాక్’ సినిమాను నిర్మించారు. అందులో లక్ష్మీ అగర్వాల్ పాత్రను దీపికా పడుకొనే పోషించారు.
‘చపాక్’ సినిమా, దానిలో నటించిన దీపిక పై సోషల్ మీడియా ట్విట్టర్ లో చర్చ సాగుతోన్న క్రమంలోనే ఓ నెటిజన్ బాలీవుడ్ డ్రీమ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి, యాసిడ్ బాధితురాలు రంగోలి చందేల్ ను ఆమెపై జరిగిన దాడి వివరాలు అడిగారు. దీనికి రంగోలి చందేల్ పాజిటివ్ గా స్పందించారు. తన చేదు జ్ఙాపకాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.
”నా పై దాడి చేసిన వాడి పేరు అవినాష్ శర్మ…అతను నా కాలేజ్ మేట్…అతనిది,నాది ఒకే ఫ్రెండ్ సర్కిల్…అతను నన్ను ప్రపోజ్ చేశాడు…దీంతో నేను అతనికి దూరంగా ఉంటున్నాను…నా ఫీలింగ్స్ ను అతనితో షేర్ చేయడం మానేశాను…అతను మాత్రం నేను ఏదో ఒక రోజు ఆమెను పెళ్లి చేసుకుంటానని అందరితో చెబుతుండేవాడు”.
”మా తల్లిదండ్రులు నాకు ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తో ఎంగేజ్ మెంట్ చేశారు…అతను మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నాడు…నేను దాన్ని తిరస్కరించే సరికి యాసిడ్ దాడి చేస్తానని బెదిరించాడు…అతని బెదిరింపులను నేను లెక్క చేయలేదు…మా తల్లిదండ్రులకు కూడా ఆ విషయం చెప్పలేదు…పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు…అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు”.
”నలుగురు అమ్మాయిలతో పేయింగ్ గెస్ట్ హౌజ్ లో ఉండేదాన్ని..ఓ రోజు ఓ వ్యక్తి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు…నా ఫ్రెండ్ విజయ నీ కోసం ఎవరో వచ్చారని చెప్పింది…నేను వెళ్లి డోర్ తీశాను…ఓ జగ్గు నిండా యాసిడ్ నింపుకొని వచ్చిన అతను సెకన్లలోనే నా ముఖంపై పోశాడు”. అంటూ రంగోలి చందేల్ తనపై జరిగిన యాసిడ్ దాడిని వివరించారు.
Advertisements
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గత దశాబ్ధంలో దేశవ్యాప్తంగా యాసిడ్ దాడులు జరిగి అందరిని ఆందోళనకు గురి చేశాయి. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, కేరళ ఈ దాడుల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఒక్క 2017 లోనే దేశవ్యాప్తంగా 244 యాసిడ్ దాడులు జరిగాయని ఎన్.సి.ఆర్.బి తెలిపింది.