బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయలలితగా కంగన కనిపించనుంది. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది.
అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మనాలి తర్వాత తనకు ఇష్టమైన ప్రదేశం హైదరాబాద్ అని ఇది ఒక అందమైన నగరం అని.. ఇక్కడి వాతావరణం, ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. మరోవైపు గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఏక్ నిరంజన్ సినిమా చేసింది కంగన. ఆయన ఛాన్స్ ఇస్తే మళ్లీ ఓ తెలుగు సినిమా చేయటానికి రెడీగా ఉన్నానని అంటోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కూడా చెప్పానని ఆమె తెలిపింది.