బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది. అయితే తాజాగా కంగనా రనౌత్ ‘తలైవి’ కోసం 20 కిలోలు పెరిగినట్లు గుర్తుచేసుకుంది. ఆ త్రోబ్యాక్ ఫోటోను కూడా షేర్ చేసింది.
ఈ మేరకు ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో “నా పాత్ర కోసం నేను 20 కిలోలు పెరిగిన ఫోటో ” అంటూ రాసుకొచ్చింది. ఇక గత ఏడాది ఆరు నెలల్లో 20 కేజీలు పెరిగి, ఆరు నెలల్లో మొత్తం కోల్పోయాక తనకు “శాశ్వత స్ట్రెచ్ మార్క్స్” ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.
జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాలో జయలలిత గా కంగనా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.