నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై మండిపడింది. హృతిక్ తన జీవితంలో ముందుకు వెళ్లకుండా చాలా చిన్న విషయమై దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. 2013,2014 మధ్యకాలంలో కంగనా మెయిల్ ఐడి నుంచి తనకు వందలాది మెయిల్స్ వచ్చాయి అని గతంలో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటెలిజెన్స్ యూనిట్ కు బదిలీ చేయాలని తాజాగా విజ్ఞప్తి చేశాడు. ఈ వ్యవహారంపై తనదైన స్టైల్లో స్పందించింది.
Advertisements
అతను తన భార్య నుంచి విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. అలాగే మేము కూడా విడిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. అలా అని అతను వేరే ఎవరితోనూ డేటింగ్ చేయటం లేదు. ఈ చిన్న విషయం గురించి ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు అంటూ చెప్పుకొచ్చింది.