మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడ్డ వాళ్ళను విచారణ లేకుండా ఉసురుతీసెయ్యాలంటుంది ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్. దివంగత నటి తునీషా శర్మ మరణంపై కంగనా రనౌత్ తనదైన తరహాలో రియాక్ట్ అయ్యింది.ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో సుధీర్ఘ నోట్ షేర్ చేసింది.
‘ఒక స్త్రీ,ప్రేమ, వివాహం,బాంధవ్యం వంటి వాటిని ప్రియమైన వ్యక్తితో సమర్థనీయంగా ఎదుర్కోగలదు. కానీ,తన ప్రేమ కథలోని అబద్ధాన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేదు. అమ్మాయిని ఓ వ్యక్తి దోపిడి చేసేందుకు ప్రేమ సులభమైన మార్గం. తునీషాది ముమ్మాటికీ హత్యే.
ఆమె తన జీవితాన్ని ముగించాలని ఒంటరిగా నిర్ణయించుకోలేదు. బహుభార్యత్వానికి వ్యతిరేకంగా బలమైన చట్టాలు అమలు చెయ్యాలని గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నేను అభ్యర్థిస్తున్నా. మహిళపై యాసిడ్ దాడులు చేసేవారిని ముక్కలు ముక్కలుగా నరికివేయాలి.
విచారణ లేకుండా వెంటనే మరణ శిక్షివిధించాలి’ అని డిమాండ్ చేసింది కంగనా.జరిగిన దుర్ఘటన పట్ల ఆమె పర్స్నల్ వ్యూ అయితే యాసిడ్ దాడి కన్నా, దారుణంగా ఉంది అనడంలో సందేహం లేదు. రానున్న కాలంలో దీనిపై కంగనా సినిమా వచ్చినా రావొచ్చు.!