టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలపై.. కంగనా రనౌత్ స్పందించింది. మహేష్ బాబు వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పింది. ఢిల్లీలో ‘ధాకడ్’ రెండవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా విలేకరులు మహేష్ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు కంగనా తన మద్ధతును ప్రకటించింది.
సూపర్ స్టార్ మహేష్ ఇటీవల మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘బాలీవుడ్ నన్ను భరించలేదు.. నేను నా టైమ్ వేస్ట్ చేసుకోలేను..!’ అంటూ ప్రిన్స్ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కాస్తా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ కామెంట్‌పై మిశ్రమ స్పందనలు వచ్చాయి.
దీంతో మహేష్ బాబు ఆ వ్యాఖ్యలపై క్లారిటీ కూడా ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపినప్పటికీ.. ఈ వివాదం సద్దుమణగడం లేదు. మహేష్ బాబు వ్యాఖ్యలపై ఫిలిం మేకర్ ముఖేష్ భట్ కూడా స్పందించారు. తాజాగా బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది.
‘మహేష్ చెప్పింది నిజమే.. నేను దీనితో ఏకీభవిస్తున్నాను. నాకు తెలుసు మహేష్ పెద్ద హీరో.. అతడికి వివిధ చిత్ర నిర్మాతల నుండి చాలా ఆఫర్లు వస్తాయి.. అంతేకాకుండా హై జనరేషన్ నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమను భారతదేశంలోనే నంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మార్చారు. కాబట్టి బాలీవుడ్ కచ్చితంగా అతనిని భరించదు. అతడు తన పరిశ్రమ పట్ల గౌరవం చూపించాడు. దానిని ఎవరూ కాదనలేరు. గత 10-15 ఏళ్లలో వారు కష్టపడి తమిళ చిత్ర పరిశ్రమను కూడా వదిలిపెట్టి ఎదిగారు. వారి నుంచి మాత్రమే మనం నేర్చుకోగలం’ అని కంగనా పేర్కొంది.
ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్, దక్షిణాది బయోపిక్‌లలో నటిస్తూ కూడా కంగన హాట్ టాపిక్‌గా మారింది. మణికర్ణిక తర్వాత ధాకడ్ లాంటి భారీ యాక్షన్ చిత్రంలో నటించింది. ధాకడ్ ఈ నెలలో విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌కి అద్భుత స్పందన దక్కింది. ఇక మహేష్‌కి మద్ధతిచ్చిన క్వీన్‌కి ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ధన్యవాదాలు తెలుపుతున్నారు.