కంగనా, రాణి లుక్ రివీల్

బాలీవుడ్ క్వీన్ కంగనా‌రనౌత్ నటిస్తున్న మూవీ గురించి లేటెస్ట్ న్యూస్. ఎట్ ప్రజెంట్ ‘మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ షూట్ రాజస్థాన్‌లోని జునాఘడ్ పోర్ట్‌లో శరవేగంగా జరుగుతోంది. గతంలో యువరాణి గెటప్‌లో కనిపించిన కంగనా, ఈసారి కంప్లీట్‌గా తన మేకోవర్‌ని మార్చేసింది. రాయల్ లుక్‌లో ఆమె బాగున్నప్పటికీ అంతగా ఎట్రాక్ట్ చేసుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరికొందరైతే లొకేషన్, వాతావరణానికి సరిపడినట్టుగా సూపర్బ్ అని అంటున్నారు. తాజా లుక్‌తో మూవీపై అంచనాలు పెరిగాయి.  ఫిల్మ్ విడుదల డిలే కావడంతో ఇలా యూనిట్ పిక్స్ లీక్ చేస్తున్నారనే వాదన లేకపోలేదు. తొలుత మే లో థియేటర్స్‌కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, చివరకు అనివార్య కారణాల వల్ల ఆగష్ట్‌కి వెళ్లినట్టు బీటౌన్ సమాచారం.