రాంగోపాల్ వర్మ ఈ పేరు చెప్పగానే ఆయన చేసే కాంట్రవర్శీలు గుర్తు వస్తుంటాయి. కాంట్రవర్శీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ కరోనా పై వర్మ తాజాగా ఓ పాటను పాటను రూపొందించారు. కరోనా వైరస్‌ను ఓ పురుగుతో పోలుస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన పాడిన ఈ పాట విభిన్నంగా ఉంది. ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు.. కరోనా ఓ పురుగు.. నీ బతుకుకి ఒక చిరుగు..అయినా చివరికి మంచే జరుగు.. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి. పచ్చడి చేద్దామంటే కండ లేదు దానికి. అదే దాని బలం.. అదే దాని దమ్ము’ అంటూ వర్మ తన స్టైల్‌లో పాడాడు.