మాట చాలా విలువైనది. ఇచ్చిన మాట కోసం సర్వస్వాన్ని వదులుకున్న గొప్పవ్యక్తుల పురాణ కథలు,గాధలు ఎన్నో ఉన్నాయి. ప్రాణమైనా వదులుకునేందుకు సిద్ధపడేవారు గానీ, ఆడినమాట తప్పేవారు కాదు. ఎన్నో ఉదంతాలు చరిత్రకి ప్రాణం ఉందని నిరూపిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.సమాజ పోకడలు మారిపోయాయి.మాట తప్పని వాడు చేతగాని వాడిగా లెక్క.
Also Read: 100 కోట్ల క్లబ్ లో మన హీరోలు !
అయితే ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాటమీద నిలబడేవారున్నారు.తన ప్రియురాలికిచ్చిన మాటకోసం కొట్ల రూపాయల జీతమిచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టాడు ఓ ప్రేమికుడు. అతని పేరు కనిష్క్ కటారియా. ఇంతకీ కనిష్క్ తన ప్రేయసికి ఏమని మాట ఇచ్చాడు?!
ఆ ప్రేయసి కోరింది ఏమిటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌత్ కొరియాలో ఒక హోటల్ లో ఇద్దరు ప్రేమికులు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా వారి భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా వచ్చిన చర్చ. అయితే వారిద్దరూ కూడా భారతదేశం నుండి కొరియాకు ఉద్యోగం కోసమే వెళ్ళిన వాళ్ళే.
సాంసంగ్ కంపెనీలో కనిష్క్ ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నాడు. అతను డిన్నర్ చేస్తున్న సమయంలో తన ప్రేయసిని నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి ఆమె నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలన్నదే తన కోరిక అని తెలిపింది.
అప్పుడతను నీ కోరిక ఇదేనా? అయితే నేటి నుండి నీ కోరిక తీర్చడమే నా గోల్ అని, కోట్ల రూపాయల జీతంతెచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియా వచ్చాడు. అప్పటి నుండి సివిల్స్ కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అయితే సివిల్స్ రాయడం అంటే అంత సులభమైన విషయం కాదు.
Also Read: రాజమౌళి సినిమాల్లోకి రావడానికి ఆమెనే కారణమా…?
ఆ విషయం కనిష్క్ కటారియాకి బాగా తెలుసు. ఎందుకంటే అతని తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. ఇండియాకి వచ్చిన తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అతను తొలిసారే ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయ్యాడు.
కటారియా ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ ను ఎంచుకుని, 2018 లో సివిల్ పరీక్షలు రాసి, అందులో ఫస్ట్ ర్యాంకును సంపాదించాడు. UPPSC లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కనిష్క్ కటారియా అంటూ వార్తల్లో నిలిచాడు.
ఇది ఎంత గొప్ప విషయం. కనిష్క్ ది ఎంత సాహసం.!ప్రేయసికిచ్చిన మాట కోసం కోట్లజీతాన్ని వదులుకుని కలెక్టర్ అయ్యాడంటే..వీడు మగాడ్రా బుజ్జి ..! 2019లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.