రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అయ్యిందోనని ఆయన అన్నారు. గ్రామ సచివాలయం, వార్డ్ వలంటీర్ల పరీక్షలు కూడా అపహాస్యం చేశారని, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయలేదని, ఇష్టానుసారం నియామకాలు చేశారని కన్నా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచందన్‌ని కలిసి ఒక మెమోరాండం అందించింది. మూడు అంశాలపై గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామని కన్నా మీడియాకు వివరించారు. భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం వలన కార్మికులు రోడ్డున పడ్డారని, ప్రజల కడుపులు మాడుతున్నాయని లేఖ రాసినా పట్టించుకోలేదని కన్నా గవర్నర్‌కు అందించిన మెమోరాండంలో ఆరోపించారు. ఇసుక ప్రజలకు అందుబాటులో లేదని చెప్పారు. సీఎం జగన్ చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని అన్నారు. ఇసుక బ్లాక్‌లో దొరుకుతుంది తప్ప ప్రజలకు అందడం లేదని అన్నారు. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కన్నా కోరారు. 2017లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు నిలిచిపోయాయని, వారికి పోస్టులు ఇవ్వాలని గవర్నర్‌కి తెలియజేసినట్టు కన్నా మీడియాకి తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.
కన్నా ఇంకా ఏమన్నారంటే..
ప్రభుత్వంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై వినతిపత్రం అందించాం
ప్రభుత్వం ఇస్తామన్న మెరిట్ ఆధారిత ఉద్యోగాలిస్తామని అపహాస్య పరిస్ధితి తెచ్చింది
రిజర్వేషన్లలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ల రిజర్వేషన్ అమలు జరగలేదు
భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కార్మికులు ఉపాధి కోల్పోయారు
సెప్టెంబరు 5కు ఇసుక అన్నారు, ఇప్పటకీ అమలు జరగలేదు
లక్షల మంది ఆకలి ఛావుల పాలవుతున్నారు
ఇంకా ఇసుక అందుబాటులోకి రాలేదు
ముఖ్యమంత్రి జగన్ మాటలు మహాత్మాగాంధీలా ఉన్నాయి, చేతలు మాత్రం జరగట్లేదు
ఇసుక బ్లాక్‌లోనే దొరుకుతోంది
దేవాలయ భూములను సొంత భూముల్లా భావిస్తున్నారు. వాటిపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
2017లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షలు జరిగాయి, ఇంకా నియామకాలు జరగలేదు
ప్రభుత్వం ఈ అంశాలపై రియాక్ట్ కాకపోతే ధర్నాకు దిగుతాం