అంతా అనుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానానికి తన రాజీనామా లేఖను పంపుతున్నట్టు ప్రకటించారు. 2014 లో ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలపట్ల తానెంతో ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, 2018 లో పార్టీ అధ్యక్షుడినయ్యానని ఆయన గురువారం వెల్లడించారు. మోడీ అంటే జీవితకాలం తనకెంతో ఆయన పట్ల అభిమానం ఉంటుందని చెప్పిన కన్నా.. కరోనా తరువాత పార్టీలో పరిస్థితులు మారాయని చెప్పారు.
ఒకవిధంగా తనను మార్చేశారన్నారు. నేను పార్టీలో ఇమడలేకపోతున్నా.. సోము వీర్రాజు అధ్యక్షుడైన తరువాత పార్టీలో పరిస్థితులు మారినట్టు భావిస్తున్నా అన్నారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది తనకు నచ్చ లేదన్నారు.
తాను ఏ పార్టీలో పని చేసినా తనను అంతా ఆదరించారని కన్నా చెప్పారు. ఏనాడూ తాను పదవులను కోరలేదన్నారు. అమరావతి ఉద్యమానికి నేను పూర్తి మద్దతు ప్రకటించానన్నారు.
సోము వీర్రాజు పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. కన్నాతో బాటు మరో 15 మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు.