కన్నడ నటుడు చేతన్ కుమార్ ని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని జిల్లా కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ‘హిందుత్వ’ అన్నది అబధ్ధాలపై ఆధారపడిందంటూ’ చేతన్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్ కాగా హిందూ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. ‘చేతన్ అహింస’గా కూడా పాపులరైన ఈ నటుడు హిందువుల సెంటిమెంట్లను గాయపరచాడని కొన్ని హిందూ సంఘాలు ఆరోపించాయి.
దళితుడు, గిరిజన యాక్టివిస్ట్ చేతన్ కుమార్.. తరఫున ఆయన లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హిందుత్వను కేవలం సత్యం ద్వారానే ‘ఓడించగలమని’, అసలు ఇదంతా అబధ్ధాల మీద ఆధారపడినదని, పేర్కొన్న చేతన్.. ఇంకా ‘సావర్కర్.. రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చాక ‘ఇండియన్ నేషన్’ ఏర్పడిందన్నది అబధ్ధమని అన్నాడు.
1992 .. బాబరీ మసీదు రాముడి జన్మస్థలమన్నది కూడా సత్య దూరమని వ్యాఖ్యానించాడు. 2023.. టిప్పు సుల్తాన్ ను యురిగౌడ, నంజే గౌడ చంపారన్నది అబద్దమని . ఇలా పలు వివాదాస్పద ట్వీట్లు చేశాడు చేతన్ కుమార్.
ఈ నెల 20 న ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఈ నటుడు చిక్కుల్లో పడ్డాడు. హిజాబ్ కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు జస్టిస్ కృష్ణ దీక్షిత్ పై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గత ఏడాది ఫిబ్రవరిలో ఇతడిపై పోలీసులు కేసు పెట్టారు.