కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండె పోటు తో మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ మరణం అభిమానులకు ఇప్పటికీ తీరని లోటుగా మారింది. అయితే పునీత్ నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ సినిమాను ఆయన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17 న రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్.
చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ లు నిర్మించారు.
అలాగే ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రల్లో కూడా నటించారు. నిజానికి ముగ్గురు అన్నదమ్ములను కలిసి చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకు ఈ కోరిక తీరబోతుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో కన్నడ డిస్ట్రిబ్యూటర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ గౌరవార్థం జేమ్స్ విడుదలయ్యాక వారం వరకూ అంటే 17 నుండి 23 మార్చి వరకు ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట.