సైరా సినిమా రామ్‌చరణ్‌కు కాసుల వర్షం కురిపిస్తుంటే… కన్నడలో మాత్రం ప్రొడ్యూసర్స్, థియేటర్ యజమానులు కొట్టుకునే స్థాయికి తీసుకెళ్లింది. సైరా సినిమాకు దేశవ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన సైరా నర్సింహ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో మరో బ్లాక్ బస్టర్ గా మిగిలిపోతుంది. అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ తో వెళ్తున్న సైరా…. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ లో మాత్రం కాకా పుట్టించింది. బెంగుళూరు లాంటి మెట్రో నగరాల్లో కూడా బెనిఫిట్ షోలు వేయడంపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలివుడ్ సినిమాలతో పోల్చుకుంటే శాండిల్ వుడ్ అంటే కన్నడ సినిమాల్లో సాంకేతిక స్థాయి తక్కువగా ఉంటుంది. అందుకే పర భాష సినిమాలు కన్నడలోకి డబ్బింగ్ అవ్వవు, అలాగే తమిళ్, తెలుగు , మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలలో నిర్మించే సినిమాలు బెంగుళూరు లాంటి మెట్రో నగరాలలో ఉదయం 8గంటల కంటే ముందు థియేటర్‌లలో ప్రదర్శించకూడదు. కన్నడ సినిమాను బతికించాలి అని 2014లో కర్ణాటక సినిమాల క్రమబద్దీకరణ చట్టాన్ని రూపొందించింది అక్కడి ప్రభుత్వం. చట్టంలోని సెక్షన్ 41లో ఓ క్లాజును కన్నడ కాకుండా బయట ఇండస్ట్రీలో నిర్మించే చిత్రాలు మెట్రో నగరాల్లో బెనిఫిట్ షో లు వేయకూడదు అని పొందుపరిచారు. కానీ సైరా చిత్రా విషయంలో చట్టాన్ని ఉల్లంఘించారు అక్కడి థియేటర్ యజమానులు. దాంతో కన్నడ ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ కు థియేటర్ యజమానులకు పెద్దగొడవే జరుగుతోంది. చూడాలి మరీ ఇది ఎంతవరకు వెళ్తుందో.