రష్మిక మందన్న…చలో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు మంచి ఫామ్ లో ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరునీకెవ్వరు సినిమాలో కూడా నటిస్తుంది. అయితే రష్మిక తెలుగులో సినిమా చేయకముందేకన్నడలో కిర్రాక్ పార్టీ అనే సినిమా చేసింది. ఆ సినిమాలో రష్మిక రక్షిత్ శెట్టి కలిసి నటించారు.ఈ సినిమా షూటింగ్ టైం లో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీరికి 2017 లో నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా 2018 లో రష్మిక రక్షిత్ శెట్టి లు విడిపోయారు.
తాజాగా ఇదే విషయం పై రక్షిత్ శెట్టి స్పందించారు. అతడే శ్రీమన్నారాయణ’ ప్రమోషన్స్‌లో భాగంగా రక్షిత్ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా రష్మికతో బ్రేకప్ గురించి మాట్లాడుతూ మన ఈ జీవితం ఎన్నో రకాల అనుభవాలను పరిచయం చేస్తుంది. అయితే అందులో కొన్ని అవి మంచి అనుభవాలై ఉండొచ్చు. అలాగే మరికొన్నిసార్లు చెడ్డ అనుభవాలై ఉండొచ్చు. కాబట్టి ప్రతి అనుభవాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.