75 శతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం కర్ణాటక లో ఉద్రిక్తతకు దారి తీసింది. కర్ణాటకలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని కన్నడ నాట ఉన్న సంఘాలన్నీ బందుకు పిలుపునిచ్చాయి. ఈ బందుతో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వారతవరణం నెలకొంది. ఆంధ్రాకు చెందిన బస్సు లు కనిపిస్తే రాళ్లు రువ్వటం మొదలు పెట్టారు. మంగళూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరే్షన్ కు చెందిన బస్సుపై దుండగులు రాళ్లు రువ్వారు. మంగుళూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన టూరిజం కార్పొరేషన్ కు చెందిన బస్సు పై ఆందోళనకారులు దాడికి రాళ్ళతో దాడి చేశారు. కర్ణాటక నుంచి తిరుపతికి వస్తున్న మరో బస్సు పై కూడా ఇలానే దాడులు జరిగినట్టు సమాచారం.
సుమారుగా వందకు పైగా కన్నడ సంఘాలు, విద్యార్థి సంఘాలు బందుకు పిలునిచ్చాయి. 75 శాతం ఉద్యొగాలు స్థానికులకే ఇస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం వాళ్ళు వాళ్ల ఉద్యోగాలు వాళ్ళకే అని చెప్తుంటే మన రాష్ట్రంలో వేరే రాష్ట్రానికి చెందిన వారికి ఎందుకు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కన్నడ నాట జరుగుతున్న ఆందోళనలో ఎక్కువగా ఆంధ్రకు చెందిన బస్సులు పైనే ఎక్కువ దాడులకు పాల్పడుతున్నారు. కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అయిన అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున ఉపాధి కోసం యువత వస్తుంటారు. కీయ పరిశ్రమతో పాటు వివిధ రకాల పరిశ్రమలు రావటంతో వలసలు ఎక్కువయ్యాయి.