ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కే జిఎఫ్ 2. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ కు విశేష స్పందన లభిస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా రాని రేంజ్ లో కేజిఎఫ్ 2 టీజర్ కు వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే 90 మిలియన్ లకు పైగా వ్యూస్ సాధించగా.. ఇంకా ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈ పాటికి ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత అనుమతులు రావడంతో ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ సినిమా టీజర్ చూసిన వారంతా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/Qah9sSIXJqk” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>