కాన్పూర్ మేయర్ ప్రమీల పాండే వివాదంలో చిక్కుకున్నారు. పోలింగ్ బూత్ లో ఓటు వేస్తు ఆదివారం ఆమె సెల్ఫీ ఫోటోలు దిగారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు ఆమెపై చర్యలకు దిగారు.
కాన్పూర్ లోని హడ్సన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేస్తున్న సమయంలో ఆమె ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఆ తర్వాత విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై జిల్లా కలెక్టర్ నేహా శర్మ సీరియస్ అయ్యారు. మేయర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘ రహస్య ఓటింగ్ ను ఆమె ఉల్లంఘించారు. ఈ మేరకు ఆమెపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాము” అని తెలిపారు.