కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి పాలిటిక్స్ లోకి రానున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రధాని మంత్రి మోడీని కలిసిన ఆయన.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
అయితే తాను పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకే బుధవారం ఆయన్ని కలిశానని రిషబ్ శెట్టి వెల్లడించారు. తాను కాంతార సినిమా చేసేటప్పుడు అడవుల్లో తిరిగానని.. దానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించానని పేర్కొన్నారు హీరో రిషబ్.
కొన్ని రోజుల క్రితం అడవిలో సంభవించిన మంటలపైనా రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. అడవుల పరిరక్షణ కోసం పాటు పడుతున్న అధికారులకు మనం అందరం సహాయపడాలని కోరారు.