కాంతార` చిత్రంతో ఒక్కసారిగా సౌత్‌లో పాపులర్ అయ్యింది సప్తమి గౌడ. అందులో డీ గ్లామర్ లుక్‌లో కనిపించి వాహ్ అనిపించింది. సహజమైన అందాలతో ఆడియెన్స్ ని మైమరపించింది. ఈ ఒక్క సినిమాతో స్టార్ అయిపోయిందీ హాట్ బ్యూటీ. ఈ సినిమాతో సప్తమి గౌడకి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఓ పాన్ ఇండియా మూవీలో నటించే బంపర్ ఆఫర్ వరించింది. వ్యాక్సిన్ వార్‌కి రెడీ అవుతుంది.
అవును `ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంతో గతేడాది సంచలనాలు సృష్టించారు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ కాంబినేషన్‌లో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. `ది వ్యాక్సిన్ వార్` పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా, కీలక పాత్ర కోసం సప్తమి గౌడని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది.
గత మూడేళ్లుగా కరోనా ప్రపంచం మొత్తం విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇందులో వ్యాక్సిన్లు కనిపెట్టేందుకు పడ్డ శ్రమ, దానికోసం చేసిన పోరాటం ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐయామ్ బుద్దా ప్రొడక్షన్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్‌తో కలిసి పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాజాగా సప్తిమి గౌడ జాయిన్ అయ్యింది. సినిమా ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఈ చివరి షెడ్యూల్‌లో సప్తమి గౌడ జాయిన్ అయ్యింది. ఇది ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇందులో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, అస్సామీ వంటి పది భాషల్లో విడుదల చేయబోతున్నారు.