ట్విట్టర్ నూతన యజమాని ఎలన్ మస్క్, అమెరికా ర్యాపర్ కాన్యే వెస్ట్‌లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో కాన్యే వెస్ట్(ప్రస్తుతం యే గా పేరు మార్చుకన్నాడు) ట్విట్టర్ ఖాతాను కొత్త యజమాని ఎలన్ మస్క్ సస్పెండ్ చేశాడు.
దీంతో కాన్యే ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌పై కాన్యే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎలాన్ మస్క్‌ను హాఫ్ చైనీస్ అంటూ సంభోదించాడు. మస్క్ ఫొటోలను నిశితంగా గమనిస్తే ఈ విషయం మీకే బోధపడుతుందంటూ తన ఇన్ స్టా ఖాతాలో కాన్యే రాసుకొచ్చాడు.
చర్చిలో శాపం పదాలను ఉపయోగించినందుకు తనను క్షమించాలన్నారు. ఇంతవరకు తన వద్ద ఒబామాకు మరో పదం లేదని పోస్ట్ చివర్లో ఆయన రాశాడు. క్యాప్షన్‌లో తనను తాను యునైటెడ్ స్టేట్స్ భవిష్యత్ అధ్యక్షుడిగా కాన్యే చెప్పుకున్నాడు.
మరోవైపు కాన్యే వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ కూడా తీవ్రంగా స్పందించాడు. కాన్యే వ్యాఖ్యలను తాను అభినందనగానే తీసుకుంటానని ఆయన వెల్లడించారు. ఇది ఇలా వుంటే నాజీలకు చెందిన స్వస్తిక్ చిహ్నాన్ని తన ప్రచార చిత్రంగా కాన్యే వెస్ట్ ట్వీట్ చేశాడు.
దీన్ని ట్విట్టర్ తీవ్రంగా పరిగణించింది. తమ సంస్థ నియమాలకు విరుద్ధంగా ఉన్నదంటూ పోస్టుపై ఆక్షేపణలు చెప్తూ కాన్యే వెస్ట్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. గతంలోనూ సెమిటిక్ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో అడిడాస్, గ్యాప్, బాలెంకిగా వంటి హై-ఎండ్ బ్రాండ్‌లతో కాన్యే వెస్ట్ భాగస్వామ్యాన్ని కోల్పోయి అనేక పరిణామాలను ఎదుర్కొన్నాడు.