భారత క్రికెట్ చరిత్రపై కపిల్ దేవ్ ది చెదరని సంతకం. స్పిన్నర్ల హవా నడుస్తున్న నేపథ్యంలో తన పేస్ బౌలింగ్ తో జట్టుకు తిరుగులేని విజయాలనందించాడు కపిల్. 1983లో కపిల్ సారథ్యంలోనే భారత క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఎన్నో ఏండ్ల నిరీక్షణ అనంతరం కపిల్ ప్రపంచ కప్ ను ఇండియాకు అందించాడు. అయితే కపిల్ జీవితం ఆధారంగా బాలీవుడులో ’83’ పేరుతో ఓ చిత్రం బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కబీర్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఎలా సాధించిందో వివరిస్తూ ఈ బయోపిక్ తెరకెక్కుతుంది.
కపిల్ సోమవారం తన పుట్టినరోజు జరుపుకుంటుండటంతో అభిమానులు కపిల్‌కు బర్త్‌డే విషేస్ చెబుతున్నారు.