విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆటగాడు కపిల్ దేవ్. విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కానీ తన ఈగో పక్కనపెట్టి జూనియర్ కెప్టెన్సీ లో ఆడాలని అన్నారు కపిల్. ప్రస్తుతం కోహ్లీ గడ్డు కాలాన్ని గడుపుతున్నాడని తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడని అన్నారు.
కోహ్లీ స్వేచ్ఛగా ఆడడానికి కెప్టెన్సీని వదులుకున్నాడని అన్నారు. కోహ్లీ ఎంతో పరిణతి చెందిన ఆటగాడని కెప్టెన్సీ వదులుకునే నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ఉంటాడని అన్నారు.
కెప్టెన్సీని భారంగా భావించి కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అన్నారు. అలాగే తాను కూడా జూనియర్స్ కెప్టెన్సీ లో ఆడానని అన్నారు. క్రిష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ వంటి తన జూనియర్ల కెప్టెన్సీలో తాను ఆడినట్లు తెలిపారు కపిల్. తనకు ఆ సమయంలో ఎటువంటి ఇగో లేదని చెప్పారు. ఇప్పుడు కోహ్లీ కూడా అలానే ఇగో లేకుండా ఆడాలని అన్నారు.