• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » ఇలాంటి ఆటగాళ్లు దశాబ్దానికి ఒక్కసారే వస్తారు: కపిల్ దేవ్

ఇలాంటి ఆటగాళ్లు దశాబ్దానికి ఒక్కసారే వస్తారు: కపిల్ దేవ్

Last Updated: January 9, 2023 at 7:40 pm

లంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం అతనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్య కుమార్ ఆటకు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా సూర్య కుమార్ ఆట తీరును భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మెచ్చుకున్నారు. అతని ఆటకు ముగ్ధుడిని అయ్యానని తెలిపారు. సూర్యకుమార్ లాంటి ఆటగాడు శతబ్దానికి ఒక్కసారే వస్తారని కొనియాడారు. అతను కొట్టిన షాట్లను ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదన్నారు కపిల్ దేవ్.

IND v SL 2023: 'He's once in a century player'- Kapil Dev lauds Suryakumar Yadav after his third T20I ton

సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని చూసినప్పుడు వీరిని ఎవరితో అయినా పోల్చవచ్చు. నిజానికి భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. కానీ నేను మాత్రం సూర్యకుమార్ లాంటి ఆటగాడిని చూడలేదన్నారు. అతని ఆడే క్రికెటే వేరని కొనియాడారు. అతపే ల్యాప్‌ లో కొట్టే ఫైన్ లెగ్ షాట్ బౌలర్‌ ను భయపెడుతుందన్నారు. ఎందుకంటే అతను నిలబడి మిడ్-ఆన్, మిడ్-వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్ లైన్ అండ్ లెంగ్త్‌ ను నిలకడగా ఎంచుకోగలడు.

అందుకే బౌలర్లు అతనికి బౌలింగ్ చేసేందుకు భయపడుతుంటారు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రికీ పాంటింగ్ వంటి గొప్ప బ్యాటర్లను నేను చూశాను. అయితే క్రికెట్ లో చాలా కొద్దిమంది మాత్రమే క్లీన్‌ గా బంతిని కొట్టగలరు. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్ బెస్ట్.. అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి ఆటగాళ్లు సెంచరీకి ఒక్కసారి మాత్రమే వస్తారు అని పేర్కొన్నారు.

క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందడం మామూలు విషయం కాదు. వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్ మెన్స్ గొప్ప ఆటగాళ్లుగా ఎదగడానికి వారి రికార్డులు మాత్రమే కారణం కాదని.. వారి ఆటతీరు కూడా అందుకు కారణమని చెప్పుకొచ్చాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా వీరి సరసన చేరుతాడని ప్రశంసించాడు కపిల్ దేవ్.

Primary Sidebar

తాజా వార్తలు

ఇళ్లకే కాదు వాకిళ్లు,ఖాళీ స్థలాలకు పరిహారం ఇవ్వాల్సిందే

నా తండ్రి తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్….!

లిక్కర్ స్కాం కేసు.. ఛార్జ్ షీట్‌ లో ముఖ్యమంత్రి పేరు..!

రొంపిచర్ల కాల్పుల ఘటనలో నలుగురి అరెస్ట్….!

ఆ పార్టీల మధ్య దూరం పెరుగుతోందా… ఆ పోస్టర్ దేనికి సంకేతం…!

దేవుడు చెప్పాడని డైవర్స్ కి అప్లై చేసాడో మహానుభావుడు…!

మళ్లీ చెడిందా..? రేవంత్ పై కోమటిరెడ్డి కంప్లయింట్..!

అదానీ వివాదం.. రేపటికి పార్లమెంట్ వాయిదా

108 రకాలతో కొత్త అల్లుడికి పసందైన విందు..!

లోకేష్ పాదయాత్ర..పలమనేరులో ఉద్రిక్తత

మోసం చేసిపోతారని ఎన్నడూ అనుకోలేదు!

సువాసనలు వెదజల్లే బాంబు.. ముట్టుకుంటే అంతే సంగతులు !

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap