కపిలవాయి రవీందర్..
నేను చాలాసార్లు బైరాన్ పల్లికి పోయిన. మొన్న 25 నాడుకూడా పోయి వచ్చినా. ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటయోధులు ఇంకా కొద్దిమంది బతికే ఉన్నారు. ఈసారి వాళ్లలో ఇద్దరిని కలిసిన. ఒకరు ఇమ్మడి ఆగమ్ రెడ్డి. ఇంకొకరు చల్లా చంద్రారెడ్డి. అప్పుడు జరిగిన అత్యాచారాలను,హత్యాకాండను,దోపిడిలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు చెప్తారు. బైరాన్‌పల్లి నరమేధం జరిగి నేటికి 72 సంవత్సరాలు.
నిజాం పాలనలో సైనికులు, రజాకార్లు,నిజాం పోలీసులు చేసిన అరాచకాలకు అంతే లేదు.ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా నరికి,కాల్చిచంపి,మహిళలను మానభంగాలు చేసిన ఘటనలెన్నో .నిజాం పాలనలో ఏ గ్రామాన్ని కదిలించినా కన్నీటిగాధలే.
సరిగ్గా ఇదేరోజు అంటే 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది.. అంతకుముందు మూడుసార్లు ఆ గ్రామంలో అరాచకం చేయడానికి వచ్చిన రజాకార్లను తరిమికొట్టారు గ్రామస్తులు. నాలుగోసారి నిజాం సైన్యం, పోలీసులు,రజాకార్లు అంతా కలిసి సూమారు ఆరు వందలమంది కలిసి గ్రామంపై పంజా విసిరారు. గ్రామస్థులు ఎదురు తిరిగారు. తిప్పి కొట్టడానికి శాయశక్తులా ప్రయత్నించారు..అందులో చాలామంది వీరమరణం పొందారు. మిగిలిన వారిని పట్టుకొని కట్టేసి,కాల్చి చంపారు.అనంతరం ఇండ్లలోకి జొరబడి యవ్వనంలో ఉన్న మహిళలను వెతికి తెచ్చి కొరడాలతో కొట్టి, నగ్నంగా చేసి,బతుకమ్మ ఆడించారు.. భర్త,తమ్ముళ్లు,అన్నలు,తండ్రుల శవాల మధ్య రోదిస్తూ విధిలేక బతుకమ్మ ఆడాల్సి వచ్చింది.
ఆ తరువాత ఊరంతా చూస్తుండగా బహిరంగంగా 63 మంది మహిళలపై
నిజాం మూకలు అత్యాచారాలు చేసారు. ఈ ఒక్కరోజే మొత్తం 96 మంది హత్యకు గురయ్యారు. 63 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఆ తర్వాత
అవమానాలు భరించలేక కొద్దిమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి.
భారత చరిత్రలో మరో జలియన్‌వాలాబాగ్ ఇది.ఊరి పొలిమేరలో అమరవీరుల స్థూపం నిర్మించారు. గ్రామం నడిబొడ్డున పెద్ద బురుజు ఇప్పటికీ ఉంది. ఏనాటికీ బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరువరానిది. అనేకసార్లు నిజాం సైన్యాన్ని, రజాకార్లమూకలను తరిమికొట్టిన గ్రామం. వీరోచిత పోరాటాలకు కేంద్రం.కానీ..
చరిత్ర పుటల్లో స్థానం దొరకని రక్తాక్షరమే బైరాన్‌పల్లి గ్రామస్థుల వీరపోరాటం. ఆనాటి అమరవీరులకు పాదాభివందనాలు. ఆనాటి ఆకృత్యాలకు సజీవ సాక్ష్యులు శ్రీ ఆగమ్ రెడ్డి, శ్రీ చంద్రారెడ్డిలతో నేను..నిజాం రాజు గొప్పోడు
నిజాం రాజు మంచోడు
అనే వెధవలకు
ఈ పోస్ట్ అంకితం.