హీరో బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ‘వీర సింహారెడ్డి’ మూవీ సక్సెస్ ఈవెంట్ లో బాలయ్య అక్కినేని తొక్కినేని, ఎస్వీ రంగారావును ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవటమే’ అంటూ ట్వీట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నాగ చైతన్య, అఖిల్.. బాలయ్య కామెంట్స్ పై రియాక్ట్ అవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే తాజాగా ఈ విషయంపై కాపునాడు స్పందించింది. నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కాపునాడు టీడీపీకి, బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేసింది. ఎస్వీ రంగారావుపై అనుచిత వ్యాఖ్యలపై ఈ నెల 25వ తేదీలోపు బాలయ్య క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది.
వీరసింహారెడ్డి విజయోత్సవ సక్సెస్ మీట్ లో ఫుల్ జోష్ లో మాట్లాడిన బాలయ్య.. సడెన్ గా సినిమాలో ఆర్టిస్టుల గురించి ప్రస్తావించారు. తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వచ్చేవన్నారు. పాత సినిమాల గురించి కూడా చెబుతూ.. నాన్న గారు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేశారు.