చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా ఈ అమ్మడు దూసుకుపోతుంది. ధృవ సర్జ హీరోగా పొగరు సినిమా లో రష్మిక నటిస్తోంది. ఈ సినిమాను సాయి సూర్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కరాబు మైండ్ కరాబు అంటూ వచ్చిన ఈ పాట ఈ సినిమా లోనిదే.
యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్ హిట్ అవడంతో తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి వైజాగ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్ రాజు రెడి అయ్యారు. తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.