అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్.
అయితే తాజా అందుతున్న సమాచారం మేరకు అఖిల్ ఇప్పుడు బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నాడట. స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అఖిల్ ను పరిచయం చేయనున్నాడట.
లైగర్ సినిమా తో విజయ్ దేవరకొండను బాలీవుడ్‌లో పరిచయం చేస్తున్న కరణ్ జోహార్ మరో సినిమాని కూడా విజయ్ తో చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే, విజయ్ దేవరకొండ ఇతర కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటంతో, కరణ్ జోహార్ అఖిల్‌ని బాలీవుడ్‌లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.
ఈ వార్తతో అక్కినేని అభిమానులు చాలా థ్రిల్ అవుతున్నారు. అయితే కరణ్ జోహార్ అఖిల్‌ని ఏ విధంగా చూపించాలి అనుకుంటున్నాడు అనేది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న గా మారింది.