హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ బస్తీలోప్రముఖ సినీనటి కరాటే కల్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తర్వాత ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేస్తూ.. శ్రీకాంత్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు కరాటే కల్యాణి. అదే విషయంపై మాట్లాడేందుకు వెళ్తే తనపై.. తన చేతిలో ఉన్న పాపపై దాడి చేశాడని కరాటే కల్యాణి ఆరోపిస్తున్నారు.
మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా వీడియోలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు కళ్యాణి. అవసరమైతే సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేస్తామని తేల్చి చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వస్తున్న వీడియోలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కల్యాణి.
ఒంటరిగా వెళ్తున్న మహిళలను ఫ్రాంక్ వీడియోల పేరుతో రెచ్చగొడుతూ కోరికలు తీర్చుకుంటున్నాడని ఆరోపించారు కళ్యాణి. అయితే.. ఒకరిపై ఒకరు పరస్పరం చేసుకున్న దాడిలో శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో కళ్యాణితో పాటు.. మరో వ్యక్తి పాల్గొన్నాడు. కాగా.. ఇరువురు చేసిన ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.