రెమ్యూనరేషన్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నారు. తన కెరీర్ కు ఎంతో ప్లస్ గా మారిన డైరెక్టర్లలో ఒకరైన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు దీపికా పదుకొణే 10కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అడిగింది. ఆ మూవీలో హీరోగా తన భర్త రణవీర్ ఉండటంతో చర్చల దశలో ఒప్పుకుంటారని నిర్మాతలు భావించినా నో చెప్పేసింది.
తాజాగా మరో హీరోయిన్ కరీనా కపూర్ ఏకంగా ఓ సినిమాకు 12కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇతీహస గాధగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు కరీనా ఈ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో షాక్ అవ్వటం నిర్మాతల వంతు అయ్యిందట. తన డిమాండ్ కు ఏమాత్రం తాను తగ్గేదే లేదు అని కూడా కరీనా స్పష్టం చేసినట్లు బీటౌన్ వర్గాల టాక్.