బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆమె రాత్రి పూట సన్ గ్లాసెస్ ధరించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతోన్నాయి. వీటిని చూసిన అభిమానులు ” రాత్ కో సన్ గ్లాసెస్ కౌన్ పెహెంట్ హై ” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కరీనా ఇటీవల తన నివాసంలో వైట్ టీ షర్ట్‌లో జుట్టును మిడ్ బన్‌లో వెనక్కి లాగి సన్ గ్లాసెస్ ధరించింది. రాత్రి వేళల్లో షేడ్స్ వేసుకున్నందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ఆమె లుక్ పై పలువురు కామెంట్లు చేస్తున్నారు.
రాత్ కో సన్‌షేడ్ కౌన్ డాల్తా హైన్, హహ్ ఇత్నీ రాత్ కో సన్ గ్లాసెస్ హహా, పాగల్ హోతే హై ఫల్తు కా స్టైల్ హై అంటూ సెటైర్లు వేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమం కోసం ఆలియా భట్, రణబీర్ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్, ఆదార్ జైన్, కరిష్మా కపూర్ , నవ్య, అగస్త్య, శ్వేత బచ్చన్, అర్మాన్ జైన్ కలిసి ఉన్న చిత్రం ఒకటి నెట్టింట షికారు చేస్తుంది.
ప్రస్తుతం కరీనా ది క్రూ లో నటిస్తోంది. అంతేకాకుండా దర్శకుడు హన్సల్ మెహాతా పేరులేని చిత్రంలో కూడా నటిస్తోంది.