నటీనటులు అంటేనే ఫ్యాషన్‌కు మారుపేరుగా ఉంటారు. ఎప్పటికప్పుడు నూతన వస్త్రాలను ధరించి ట్రెండ్‌ను సృష్టిస్తుంటారు. అందుకనే ఫ్యాన్స్ కూడా వారి అడుగు జాడల్లో నడుస్తూ కొత్త కొత్త ఫ్యాషన్‌లను ఫాలో అవుతుంటారు. ఇక బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా ఫ్యాన్స్ కోసం చక్కని ఫ్యాషన్ ట్రీట్ ఇచ్చింది. రెండోసారి గర్భం ధరించాక కరీనా కపూర్ బేబీ బంప్‌తో కనిపిస్తూనే మరోవైపు ట్రెండీ ఫ్యాషన్‌తో ఆకట్టుకుంటోంది.
తాజాగా నిర్వహించిన వాట్ వుమెన్ వాంట్ అనే ఓ రేడియో షోలో పాల్గొనేందుకు బయటకు వచ్చిన కరీనా కపూర్ కొత్త డ్రెస్‌తో అలరించింది. గౌన్ లాంటి గ్రే కలర్ డ్రెస్ వేసుకుంది. దానికి ఓ బెల్ట్ పెట్టుకుంది. హీల్స్ ధరించింది. అంతే.. సింపుల్ లుక్‌తో ఆకట్టుకుంది. కాగా ఆమె ఆ డ్రెస్ ధరించి ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం కరీనా లుక్‌కు ఫిదా అవుతున్నారు. ప్రెగ్నెంట్ అయినప్పటికీ చాలా ఫ్యాషన్‌గా కరీనా కనిపిస్తుందంటూ వారు ఆమెకు కితాబిస్తున్నారు.
Advertisements
ఇక కరీనా కపూర్ త్వరలో లాల్ సింగ్ చడ్డా అనే మూవీలో కనిపించనుంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా ఆ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా కరీనా ఇటీవలే భర్త సైఫ్ అలీఖాన్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి వచ్చింది. అక్కడ సైఫ్ నటిస్తున్న భూత్ పోలీస్ మూవీ షూటింగ్ ఇటీవలే జరిగింది.