చాలా కాలం నుంచి బాలీవుడ్ ను పట్టిపీడిస్తున్న విషయం ”బాయ్ కాట్ ట్రెండ్”. సినిమా విడుదల కాకముందే ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసేస్తున్నారు. దీంతో బాక్సాఫీసు వద్ద పెద్ద హీరోల సినిమాలైన సరే చతికిలపడిపోతున్నాయి.
ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్లాప్‌లుగా నిలిచాయి కూడా. తాజాగా దీని గురించి బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్పందించారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ అనేది సినీ పరిశ్రమకు మంచిది కాదు అని అభిప్రాయపడ్డారు. దీంతో తాను ఎప్పటికీ ఏకీభవించనని చెప్పారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేయగలమని ప్రశ్నించారు.
సినిమాలే లేకపోతే మీకు వినోదం ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ , దీపికా పదుకొనే జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం పఠాన్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలోని ఓ పాటలో దీపికా కాషాయ రంగు దుస్తులు ధరించిన విషయం పెద్ద వివాదానికి దారి తీసింది.
దీంతో, ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆమిర్ ఖాన్ తో కలిసి తాను నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా సైతం బాయ్ కాట్ దెబ్బకు గురైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఒక డిజాస్టర్ గా నిలిచిపోయింది