నిన్న జరిగిన ఘటనలు అందరూ చూశారు
డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించిన తర్వాత నుంచి నిన్నటి అంత్యక్రియల వరకు పోలీసులు ఎంతో ఇబ్బంది పెట్టారు.
ఆస్పత్రి నుంచి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ ను కొట్టి పోలీసులే మృతదేహఆన్ని ఇంటివద్ద పడేసి వెళ్ళారు
ఆ కుటుంబానికి, కార్మికులకు న్యాయం జరగాలన్న ఆర్టీసీ జేఏసీ నిర్ణయం మేరకు అంత్యక్రియల ఆపాం.
సీఎం చర్చలు జరపేంతవరకు అంతిమ యాత్ర చేయకూడదని జేఏసీ నిర్ణయించింది.
చివరి చూపుగా డిపోకు తమ నాన్న మృతదేహాన్ని తీసుకెళ్ళాలని కుటుంబసభ్యులు కోరారు.
మొదటి రోజు అర్ధరాత్రి అరెస్టు చేయాలని, కరెంట్ తీసేయాలని చూసారు.
శాంతియుతంగా అంతిమ యాత్ర చేస్తామని కోరాం
కానీ నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది.
మఫ్టీ పోలీసులే శవాన్ని ఎత్తుకెళ్లాకు.
మఫ్టీలో ఉండి కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దారు.నక్సలైట్ల చేతిలో అమరులైన పోలీసుల ఆత్మలు నిన్నటి మీ తీరు తీసి ఘోషిస్తున్నాయి
ప్రమోషన్లకోసం ప్రభుత్వానికి గులాం గిరి చేస్తారా?
స్వయంగా నాపై పోలీసులు దాడి చేసారు.
నిజమైన, నిజాయితీ గల పోలీసు అధికారులు లూప్ లైన్ లో ఉన్నారు.
మాస్క్ లు వేసుకుని లాఠీలు లేకుండా ఎలా కొట్టొచ్చో చూపించారు.
హోంమంత్రి, డీజీపీ ఎక్కడున్నారు. ముఖ్యమంత్రికి గులాం గిరీ చేస్తున్నారా?
శవాన్ని ఎత్తుకెళ్ళిన పోలీసుల ను చూస్తే సిగ్గేస్తుంది
21 మంది చనిపోతే నిజాం తరహాలో రాజభోగాలు అనుభవిస్తున్నారు
రజకార్లలాగా ఉంటామంటే తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపిస్తాం
లక్షల మంది కి ఎంపీనైన నాపై దాడి ప్రజలపై దాడి జరిగినట్లే. నా గళ్లా పడితే వాళ్ల గళ్లా పట్టినట్లే
ఆ ఇద్దరు పోలీసులపై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ పెడ్తా.
సీఎం పతనం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది.
శవరాజకీయాలు చేస్తున్నారంటూ అధికార పత్రికలో రాసారు.
21 మంది ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు ఆ పత్రికకు ఎందుకు కనిపించలేదు.
చర్చలు జరపమంటే ఎందుకు జరపడం లేదు
కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు.
సెల్ఫ్ డిస్మిస్ అనే పదం వెనక్కి తీసుకుని కార్మికులను చర్చకు పిలవాలన్న మానవత్వం లేదుఆర్టీసీ కార్మికులు బయపడొద్దు. ధైర్యంగా ఉండండి.
నిన్నటి పోరాటంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు, జేఏసీ నేతలకు హ్యాట్సాఫ్
వేయి ఎలకలు తిన్న పిల్ల పాపాలు పోగొట్టుకునేందుకు యాగాలు చేస్తున్నట్టు సీఎం యాగాలు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించారు. వాళ్ల పేర్లు కూడా తెలియదట.
నాపై వెనక నుంచి ఒకరు, ముందు నుంచి ఒకరు పథకం ప్రకారం దాడి చేసారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.గవర్నర్ నివేదిక కూడా కేంద్రానికి వెళ్లింది.