ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరై, కరీంనగర్ వచ్చి… కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన ఇండోనేషియా పౌరులపై కరీంనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 420, 269,270, 188 కింద కేసులు నమోదు చేశారు.
మొత్తం 10 మంది ఇండోనేషియా పౌరులతో పాటు ఇద్దరు యూపీకి చెందినవారు, ఇద్దరు కరీంనగర్ కు చెందిన వారిపై ఎఫ్. ఐ.ఆర్ నమోదు అయింది.
మార్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చి విషయాన్ని గోప్యంగా ఉంచటంతో పాటు వైరస్ వ్యాప్తి కి కారణం అయ్యారు.