ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆది పురుష్ ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు. సీతగా కృతిసనన్ కనిపించనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ప్రభాస్ ముంబై లో ఉంటున్నారు. ఈ సందర్భంగా సైఫ్అలీఖాన్ కుటుంబం కోసం ప్రత్యేకంగా కొన్ని వంటకాలను తయారు చేపించి పంపించారు. బిర్యానీ తో పాటు ఖీర్ కూడా పంపించారు.
ఇక ఇదే విషయాన్ని తెలుపుతూ సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనాకపూర్ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాహుబలి బిర్యానీ పంపిస్తే అది ఖచ్చితంగా ది బెస్ట్ అవుతుంది. థాంక్యూ ప్రభాస్ అంటూ పోస్ట్ పెట్టారు.