కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో ఒక్క రాష్ట్రాన్ని ఆక్రమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా ఆంక్షల గుండంలోకి పోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. పండగలు, వేడుకలను నిషేధించాయి. తాజాగా కర్ణాటక నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి 10 రోజులపాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది.
ఇప్పటికే రెస్టారెంట్లు, హోటల్, పబ్ ల పరిమితులు విధించింది. 50 శాతం మందితో మాత్రమే వాటిని నిర్వహించాలని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కర్నాటకలో ఇప్పటి వరకూ 38 ఒమిక్రాన్ కేసులు వెలుగు చేశాయి. దీంతో, అక్కడి ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది.